గాల్లో కలుస్తున్న ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Jun 10 2026 1:37 AM | Updated on Jun 10 2026 1:37 AM

● ఈ నెల 5న నిర్మల్‌ జిల్లా కుంటాలకు చెందిన పశువుల కాపరి న్యాకపు సుధాకర్‌(74) వెంకూరు శివారులో పశువులు మేపుతుండగా, వర్షం రావడంతో మామిడి చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగుపడి మృత్యువాత పడ్డాడు.

● గత నెల 31న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం చెలిమల కొలంగూడకు చెందిన టేకంభీం(50) భార్య రాజుబాయి(45) రెబ్బెన మండలం కై రిగూడ సమీపంలో వ్యవసాయ పనుల్లో ఉండగా పిడుగు పడి చనిపోయారు. అదే రోజు ఆసిఫాబాద్‌ మండలం కౌటగూడకు చెందిన పెందూరు లింగు(50) పత్తి కట్టెలు ఏరుతుండగా వర్షానికి చెట్టు కిందకు వెళ్లగా పిడుగుపాటుకు మరణించాడు.

● గతేడాది జూన్‌12న ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం పిప్రిలో నలుగురు, బేల మండలం సాంగిడిలో ఇద్దరు వ్యవసాయ పనుల్లో ఉండగా, ఆరుగురిపై పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు.

● గతేడాది సెప్టెంబర్‌ 9న మంచిర్యాల జిల్లా పా త బెల్లంపల్లికి చెందిన గెల్లె పద్మ(43) పత్తి చేనులో కలుపు తీస్తుండగా మృత్యువాత పడింది.

● గతేడాది సెప్టెంబర్‌ 10న నిర్మల్‌ జిల్లా పెంబి మండలం నాగాపూర్‌కు చెందిన బండారి వెంకటి(50), భార్యాభర్తలు ఆలకుంట ఎల్ల య్య(37), లక్ష్మి(32) గుమ్మెనఎంగ్లాపూర్‌ శివారులో పత్తి చేనులో ఉండగా వర్షం పడింది. మంచె వద్దకు వెళ్లగా, ఉరుములు మెరుపులతో పిడుగుపడి ముగ్గురూ మృత్యువాత పడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement