సాక్షి,ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పోలీస్‌బాస్ మంగళవారం రాత్రి విచ్చేశారు. డీజీపీ సీవీ ఆనంద్‌కు కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వాగతం పలికారు. వారి వెంట ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డీజీ చారుసిన్హా ఉన్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
బెల్లంపల్లిలో ఏడాది అదనపు ఎస్పీగా..
డీజీపీ సీవీ ఆనంద్ తన కెరీర్ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో ఆపరేషన్స్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(అడిషనల్ ఎస్పీ)గా ఏడాది పాటు పనిచేశారు. నక్సలైట్లపై కూంబింగ్ ఆపరేషన్లకు స్వయంగా నాయకత్వం వహించారు. డీజీపీగా తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
నేటి పర్యటన ఇలా..
ఉదయం జిల్లా పోలీసు అధికారులతో క్రైం రివ్యూ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం కలెక్టరేట్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. వీటితోపాటుపలు ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.


