అతి వ్యాయామంతో గుండెపోటు! ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా ఎందుకంటే..

Over Excercises Work Outs Cause Risk Early Age Deaths India - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి..

అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్‌లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్, గాయకుడు కేకే, కమేడియన్‌ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విజయకుమార్‌ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్‌సైజ్‌లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్‌ కుమార్‌ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top