పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..! | Sakshi
Sakshi News home page

పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!

Published Sun, Sep 12 2021 8:25 PM

Eating at your Work Station Get More Side Effects - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో అందరూ వర్క్‌ ఫ్రం హోంకే పరిమతమయ్యరు. చాలామంది దీనికే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని నెలలుగా ఆఫీసులు, పరిశ్రమలు మళ్లీ తెరవడంతో అందరూ ఆఫీసులకి వెళ్లడం మొదలైంది. ఇన్నాళ్లు వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా ఇంటి వాతవరణాన్ని ఆఫీస్‌ మాదిరిగాసెట్‌ చేసి పనులు చేసుకున్నారు.

ఎ‍ప్పుడేతే బాస్‌లు ఆఫీస్‌లకు రమ్మని చెప్పారో అక్కడి వాతావరణానికి అలవాటుపడటానికీ, యథాస్థితికి రావడటానికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారట. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనకు నచ్చిన విధంగా, ఎలా కావల్సితే అలా ఉండేవాళ్లం.. తినేవాళ్లం. కానీ ఆఫీసులో అలా తినడానికి.. ఉండటానికి కుదరదు. క్యాంటీన్‌కు వెళ్లాల్సిందే. అయితే అలా వెళ్లడానికి బద్దకించి.. కొందరు కూర్చున్న దగ్గరే తింటున్నారట. కానీ ఇలా పని చేసే దగ్గరే తింటే అది మన ఆరోగ్యం మీద రకరకాల దుష్ప్రభావాలు చూపుతుందంటున్నారు నిపుణులు. ఆ దుష్ప్రభావాలు ఏంటంటే.. 

తెలియకుండానే ఎక్కువ తినేస్తాం....
వర్క్‌ ప్లేస్‌లో తినేటపుడు ఒక చేతిని కీబోర్డు పై ఉంచి.. మరొక చేత్తో స్పూన్‌ పట్టుకుని తినడం వల్ల ఎంత తింటున్నమో? ఏమి తింటున్నామో గమనించకుండా తినేస్తాం. దీని వల్ల ఎక్కువ కేలరీలు మన శరీరంలో చేరి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది. లేదా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. (చదవండి: మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌!)

గబగబ తినేయడం....
వర్క్‌ హడావిడలో గబగబ తినేయడంతో మధ్య మధ్యలో గాలిని మింగేస్తాం, నీళ్లు తాగేస్తుంటాం. దీని వల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమయానుగుణంగా తినడం......
సమయానుగుణంగా తినకపోవటం చాలా మంది చేసే అతి పెద్ద తప్పు. వర్క్‌ ఎక్కువగా ఉందనో లేక ఇతరత్ర కారణాల వల్ల చాలా మంది టైమ్‌కి తినరు. ఇది మన జీర్ణవ్యవస్థ మీద అత్యంత దుష్ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఎసిడిటీ, అల్సర్‌, వంటి రకరకాల వ్యాధుల భారిన పడే అవకాశాలు ఎక్కుగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందరూ ఇంతలా కష్టపడి పనిచేసేది కుటుంబం కోసమే కదా. విరామం తీసుకుని నిదానంగా తింటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం దొరికనట్టు ఉంటుందీ, మళ్లీ  మరింత వేగంగా, ఉత్సహంగా పనిచేయగలిగే శక్తి లభిస్తోంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి బ్రేక్‌ తీసుకుని నిదానంగా, టైంకి బోజనం చేయడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యగంగా ఉంటాం. అప్పుడే మనం, మన ఫ్యామీలీతో ఉల్లాసంగా గడపగలం. కాబట్టి క్యాంటీన్‌ ఏరియాకు వెళ్లి తినడం మేలు.
 (చదవండి: పట్టాలపై మతిస్థిమితం లేని మహిళను కాపాడిన పోలీస్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement