ఢిల్లీ ఎక్సైజ్‌ కేసులో కొత్త వివాదం | Arvind Kejriwal refuses to appear before Justice Swarana Kanta | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎక్సైజ్‌ కేసులో కొత్త వివాదం

Apr 27 2026 10:34 AM | Updated on Apr 27 2026 11:10 AM

Arvind Kejriwal refuses to appear before Justice Swarana Kanta

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కొత్త వివాదం రాజుకుంది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకావడం లేదని జడ్జి స్వరణ కాంత శర్మకు ఓ లేఖ రాశారు.

‘‘న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. తప్పుడు ఆరోపణలతో నన్ను జైలుకు పంపారు. అందుకే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జడ్జి స్వరణ కాంత శర్మపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ, ఆమెపై విశ్వాసం లేదు. అందుకు కారణం ఆమె బీజేపీ అనుబంధ కార్యక్రమాలకు వెళ్లడం. కాబట్టి ఆమె ఎదుట విచారణకు హాజరు కాలేను. నా మనసాక్షి ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాను.  ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా’’ అని లేఖలో కేజ్రీవాల్‌ తెలిపారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జడ్జి స్వరణ కాంత శర్మ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె బీజేపీకి దగ్గరి మనిషని, ఆమె పిల్లలు కూడా కేంద్ర విభాగంలో పని చేస్తున్నారని.. కాబట్టి ఆమెను కేసు నుంచి తప్పించాలని కోరారాయన. అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 

కేవలం అనుమానాలు, ఊహాగానాల ఆధారంగా రిక్యూసల్‌ ఇవ్వలేం. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నా కుటుంబ ప్రస్తావనతో కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలు సరికాదు. ఆయన కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అని జడ్జి శర్మ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement