కనగల్ : సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపట్టే హ్యమ్ రోడ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో.. కనగల్ సబ్ మార్కెట్ యార్డ్ వద్ద పైలాన్‌ను నిర్మిస్తున్నారు. శుక్రవారం పైలాన్ నిర్మాణ స్థలంలో కంకర మట్టిని పోసి డోజర్లతో చదును చేసి పనులను ప్రారంభించారు. ధర్వేశిపురం స్టేజీ సమీపంలో హెలిపాడ్ పనులు మొదలు పెట్టారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.పద్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ గణేష్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, చండూరు సీఐ టీ.రాము, ఎస్‌ఐ కె.రాజీవ్‌రెడ్డి, జేఈలు దినేష్‌రెడ్డి, శ్రీకాంత్, సర్పంచ్ నర్సింగ్ మురళిగౌడ్, మాజీ సర్పంచ్ సునీత కృష్ణయ్యగౌడ్, ఆర్‌ఐ సునీత, ఏఆర్‌ఐ యాదగిరి పాల్గొన్నారు.


