నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు శ్రీకాంత్‌రెడ్డి, సాయిశివాని, పారస్ కుమార్ శుక్రవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. విజయవిహార్ అతిథిగృహానికి చేరుకున్న వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు సాగర్ ప్రధాన ఆనకట్టతో పాటు బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధచరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించారు. బుద్ధవనం విశేషాలను తెలిపే లఘచిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ శాసన వారికి కండావాలు కప్పి, బోచర్లను అందచేశారు. టూరిజం గైడ్ సత్యనారాయణ.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విశేషాలను వివరించారు. వారివెంట పెద్దవూర తహసీల్దార్ ఖాసీం, ప్రొటోకాల్ అధికారి దండ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.


