తొలకరి పలకరింపు | - | Sakshi
Sakshi News home page

తొలకరి పలకరింపు

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

సాగు పనుల్లో రైతులు

నల్లగొండ అగ్రికల్చర్‌ : తొలకరి పలకరించింది. జిల్లా అంతటా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మొస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటున 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అడవిదేవులపల్లిలో అత్యధికంగా 105.7 మిల్లీమీటర్లు, నాంపల్లి 80.6, దామరచర్ల 70.0, చిట్యాల 8.8, నార్కట్‌పల్లి 10.7, కట్టంగూర్‌ 20.3, శాలిగౌరారం 30.4, నార్కట్‌పల్లి 39.3, కేతేపల్లి 1.5, తిప్పర్తి 6.8, నల్లగొండ 9.2, హాలియా 13.2, నిడమనూరు 17.4, త్రిపురారం 34.7, మిర్యాలగూడ 3.4, తిరుమలగిరిసాగర్‌ 23.2, పెద్దవూర 70.2, చింతపల్లి 4.0, గుర్రంపోడు 6.2, పీఏపల్లి 14.0, నేరడుగొమ్ము 28.5, కొండమల్లేపల్లి 13.4, దేవరకొండ 7.6, గుండ్లపల్లి 3.1, చందంపేట 8.8, గుడిపల్లి 27.2, మునుగోడు 13.4, చండూరు 7.5, మర్రిగూడలో 37.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మంచి వర్షం కురవడంతో వానాకాలం సాగు పనులు రైతులు ముమ్మరం చేశారు. ఇప్పటికే దేవరకొండ, చందంపేట, పెద్దవూర, హాలియా, నకిరేకల్‌, నాంపల్లి, చింతపల్లి, అడవిదేవులపల్లి, గుర్రంపోడు, మునుగోడు, నార్కట్‌పల్లి, నల్లగొండ, కనగల్‌, తిప్పర్తి మండలాల్లో రైతులు పత్తి కట్టెను తీసి దుక్కులు దున్నుకున్నారు. మరోమారు మోస్తరు వర్షాలు కురిస్తే పత్తి విత్తనాలు విత్తుకునే అవకాశం ఉంది. వానాకాలం వరిసాగుకు వరినార్లు కూడా పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement