ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో 20 చెరువులను అభివృద్ధి చేయనున్నారు. రూ.55 కోట్లతో చెరువు కట్టల వెడల్పు, రాతి కట్టడం, కలుషిత నీరు దారి మళ్లించడం లాంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చెరువుకు కట్టకు లోపలి భాగంలో మొత్తం రాతి కట్టడం నిర్మించడం ద్వారా చెరువులోని నీరు గాలికి అలలుగా వరద తాకిడికి చెరువు కట్ట కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువు కట్టలను విస్తరణ చేపట్టడంతో రాకపోకలకు కూడా సులభంగా మారనుంది.
మిర్యాలగూడలో చెరువు కట్టకు రాతి కట్టడం పనులు


