ధాన్యం తూకాల్లో మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తూకాల్లో మాయాజాలం

Jun 11 2026 8:17 AM | Updated on Jun 11 2026 8:17 AM

న్యాయం చేయండి

ధాన్యం తూకాల్లో రైతులకు అన్యా యం జరిగింది. కేంద్రంలో తూకం లెక్కకు, మిల్లు వద్ద తూకానికి 14క్వింటాళ్లు తక్కువగా చూపడం

దారుణం. అధికారులే న్యాయం చేయాలి.

– గాదరి ప్రసాద్‌, రైతు, అయిటిపాముల

కట్టంగూర్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో అక్రమాలు వెలుగు చూడడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలో కాంటా వేసిన ధాన్యం లెక్కకు, రైస్‌ మిల్లులో వేసిన లెక్కకు పొంతన లేకుండా పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈనెల 6న అయిటిపాముల కొనుగోలు కేంద్రంలో రైతులు గాదరి ప్రసాద్‌ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్యకు చెందిన 27 బస్తాల చొప్పున మొత్తం 634 బస్తాల ధాన్యాన్ని కేంద్ర నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు 42 కేజీల చొప్పున కాంటా వేసి మొత్తం 266 క్వింటాళ్ల ధాన్యం రికార్డులో నమోదు చేశారు. అనంతరం ఈ ధాన్యానిన చెర్వుఅన్నారం గ్రామంలో ఉన్న శివసాయి రైస్‌ మిల్లుకు తరలించారు.

14.65 క్వింటాళ్లు తక్కువగా చూపారు!

లారీ రైస్‌మిల్లు చేరుకున్నాక దిగుమతి సమయంలో మిల్లు యాజమాన్యం ఒక్కో బస్తాకు 2 కేజీల చొప్పున తరుగు తీసి 40 కేజీల చొప్పున తిరిగి తూకం వేశారు. ఈ క్రమంలో ఏకంగా 14.65 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపించడంతో రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదేమిటని మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఐకేపీ కేంద్ర నిర్వాహకులనే అడగండి అని సమాధానం ఇచ్చినట్లు రైతులు తెలిపారు. తీరా కేంద్రం నిర్వాహకులను నిలదీస్తే మాకేమీ తెలియదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ జరుపుతాము..

ఇదే విషయమై సివిల్‌ సప్లయ్‌ డీటీ ఆర్‌.జ్యోతిని వివరణ కోరగా ధాన్యం తూకంలో భారీ మొత్తంలో తక్కువగా రావటానికి ఆస్కారం లేదని చెప్పారు. దీనిపై తక్షణమే స్పందించి రైస్‌మిల్లు యాజమాన్యంతో పాటు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కేంద్రంలో ఒక లెక్క.. మిల్లులో మరో లెక్క!

ఫ అయిటిపాముల ఐకేపీ కేంద్రంలో తాజాగా వెలుగుచూసిన మోసం

ఫ 266 క్వింటాళ్ల ధాన్యానికి 14.65 క్వింటాళ్ల తరుగు

ఫ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతుల ఆవేదన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement