మిర్యాలగూడ : అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) బాధ్యతగా వ్యవహరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేతతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రభుత్వంపై విశ్వాసం పెంచే దిశగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడంలోనూ బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో మాసనపల్లి లింగాజి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


