బీఎల్‌ఏలు కాంగ్రెస్‌ పార్టీకి పునాది | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు కాంగ్రెస్‌ పార్టీకి పునాది

Jun 10 2026 2:48 AM | Updated on Jun 10 2026 2:48 AM

హాలియా : బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) కాంగ్రెస్‌ పార్టీకి పునాది అని శాసనమండలి విప్‌ బల్మూర్‌ వెంకట్‌, డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌నేత అన్నారు. హాలియాలో మంగళవారం నిర్వహించిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గం బూత్‌ లెవల్‌ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో వారు ముఖ్య మాట్లాడారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని, పటిష్టత కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకే కాంగ్రెస్‌ పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. బీఎల్‌ఏలు ఓటర్ల నమోదు సమయంలో అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి ఒక్క ఓటును నమోదు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు కర్నాటి లింగారెడ్డి, శిక్షణ అసెంబ్లీ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చింతల చంద్రారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ అంకతి సత్యం, వివిధ మండలాల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, సర్వయ్య, కృష్ణనాయక్‌, రామేశ్వరి, అంబటి సోమయ్య, నాయకులు మజహర్‌ మైనొద్దీన్‌, పాండునాయక్‌, బానుచందర్‌రెడ్డి, పద్మ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement