విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యం అవుతుంది. చిన్నబోయినపల్లి పాఠశాల 1–8 వరకు ఉందని, దానిని 10 వరకు పెంచితే డ్రాపౌట్స్ లేకుండా నివారించవచ్చు. ఆశయం గ్రంథాలయం పేరుతో అక్కడ 2 వేల పుస్తకాలను యూపీఎస్‌సీ, గ్రూప్స్, డీఎస్సీ, ఎస్సై, పీసీలకు కావాల్సిన పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాం. దాంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. పాఠశాలను మ రింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
–దూపాటి సతీశ్, ఆశయ గ్రంథాలయ
నిర్వాహకుడు, కానిస్టేబుల్, చిన్నబోయినపల్లి


