రక్తదానం మరొకరికి ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానం మరొకరికి ప్రాణదానం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి అర్బన్‌: రక్తదానంతో మరొకరికి ప్రాణదానం కలుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మిరాకిల్‌ వాలంటరీ ఆర్గనైజేషన్‌న్‌ఆధ్వర్యంలో ఆదివారం ఐటీ మాస్టర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్తం ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ఎలాంటి హాని ఉండదని, నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి విలువైన సేవ చేసినవారిగా నిలుస్తారని తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ కార్యాలయం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసి సత్కరించారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన వేముల శంకర్‌తో పాటు నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement