ములుగు రూర్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించి, పాస్టిక్ రహిత ములుగు లక్ష్య సాధనకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం, ఆర్గానిక్ వస్తువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపారులు 120 మైక్రాన్ కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగించొద్దన్నారు. నిబంధనలను ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్‌ఎంట్ సైంటిస్ట్, మున్సిపల్ కమిషనర్ సంపత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్, జేఏఓ సుధాకర్ తదితరులు ఉన్నారు.


