ఉచితంగా చికిత్స పొందుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా చికిత్స పొందుతున్నాం..

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ఉచితంగా చికిత్స పొందుతున్నాం.. మెరుగైన వైద్యసేవలు

డయాలసిస్‌ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందుతున్నాం. నా భర్త మీరాసాబ్‌కు వ్యాధిగ్రస్తుడై ఇబ్బంది పడుతున్నాం. వేరే ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. ఈ సెంటర్‌ లేకపోతే నా భర్తకు నయం అయ్యేది కాదు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. మరో రెండు మిషన్లు తెప్పిస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది.

– షాలిమా, పెద్ద వెంకటాపురం

మూత్రపిండ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. మొత్తం 26 మంది రోగులు వారానికి మూడు రోజుల చొప్పున రావడంతో సమయం సరిపోవడం లేదు. మరో రెండు మిషన్లు ఈ సెంటర్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది.

– బోడ పవన్‌,

డయాలసిస్‌ సెంటర్‌ టెక్నిషియన్‌,

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement