ఏటూరునాగారం: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం వాసం సాంబశివరావు ఆధ్వర్యంలో రొయ్యూర్, బూటారం గ్రామాల్లో ఉపాధి పనుల వద్దకు కూలీలకు ప్రభు త్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య, భోజనం, రెండు జతల దుస్తులు, పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, వయస్సు నిండని వారిని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. గ్రామాల్లోని తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాలయాలకు పంపించి డబ్బును వృథా చేసుకోవద్దని కోరారు. అనంతరం శంకరాజుపల్లి గ్రామాల్లో కూడా ఇంటింటా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధ్యాయుడు శ్రావణ్ తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, సుమ న్, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


