భూపాలపల్లి అర్బన్: పరిశ్రమలలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారి బంగారు భవితను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం కోర్టుహాల్‌లో పోలీసు అధికారులతో చర్చించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పారా లీగల్ వాలంటీర్లు, కార్మిక శాఖ, రెవెన్యూశాఖ అధికారుల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, ిసీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.


