ఔషధాల గని.. ‘లక్ష్మణఫలం’ | - | Sakshi
Sakshi News home page

ఔషధాల గని.. ‘లక్ష్మణఫలం’

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధగని ‘లక్ష్మణఫలం’. విటమిన్‌ సీ, పోటాషియం, ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ పండును క్రమం తప్పకుండా తినడం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంతో పాటు కేన్సర్‌ గుణాలను తగ్గింస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పైగా వీటి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుందని తెలుస్తుంది. అరుదుగా లభించే లక్ష్మణ ఫలం చెట్టు వాజేడుకు చెందిన వేములవాడ దుర్గ, నాగేశ్వరరావు దంపతులు వారి ఇంట్లో పెంచగా ఇప్పుడు కాయలు కాసింది. ఈ పండ్ల కోసం పలు గ్రామాలు, జిల్లాల నుంచి వీటి ప్రత్యేకత తెలిసిన వారు వస్తున్నారని నాగేశ్వరరావు అంటున్నారు.

– వాజేడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement