పల్స్‌ పోలియో విజయవంతానికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పల్స్‌ పోలియో విజయవంతానికి కృషి చేయాలి

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

ములుగు రూరల్‌: పల్స్‌ పోలియో కార్యక్రమం విజ యవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్‌లో వచ్చే వ్యాధుల నియంత్రణకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. జూన్‌ 28న జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షకులు సమన్వయం పరచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధీర్‌, పోగ్రాం అధికారి శ్రీకాంత్‌, వైద్యాధికారులు రంజిత్‌, నాగ అన్వేష్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, సాంబయ్య, తదితరులు ఉన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాలరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement