చేయూత ఏది? | - | Sakshi
Sakshi News home page

చేయూత ఏది?

Jun 12 2026 5:51 AM | Updated on Jun 12 2026 5:51 AM

జూన్‌ 2న పింఛన్లు ఇస్తామని.. వితంతువులకు వెంటనే..

నిరాశలో కొత్త పింఛన్‌ దరఖాస్తుదారులు

నాలుగేళ్లుగా పింఛన్‌ రావడం లేదు..

ములుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పథకం కింద కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దీంతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు సంతోషించారు. కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 37,353 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీరికి ప్రతినెలా రూ.9.07 కోట్లను ప్రభుత్వం అందిస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా పింఛన్లు మంజూరు చేసింది. పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ప్రజావాణిలో, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయడమే కాకుండా నేరుగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో అధికారులకు దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 4,500 మందికి పైగా వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించటంతో జిల్లాలో వందలాది మంది దరఖాస్తుదారులు పలు రకాల ధ్రువపత్రాలను మీసేవ కేంద్రాల ద్వారా తీసుకున్నారు. ప్రధానంగా భర్త మరణ ధ్రువీకరణ, వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌, సదరం క్యాంపుల్లో పొందిన వికలాంగుల ధ్రువీకరణ తదితర పత్రాలు తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పింఛన్ల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు.

వృద్ధాప్య పింఛన్‌ పొందే వ్యక్తి చనిపోతే మృతుడి భార్య జీవించి ఉంటే ఆమెకు వెంటనే వితంతు పింఛన్‌ మంజూరు చేస్తున్నారు. కానీ వయస్సు రీత్యా 65 ఏళ్లు దాటిన వారికి, సదరం క్యాంపు ద్వారా వికలాంగుల సర్టిఫికెట్‌ పొందిన వారికి, చిన్న వయస్సులో భర్త చనిపోయిన వారికి, ఒంటరి మహిళలు, బీడీ, గీత, చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. నాలుగేళ్లుగా పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో సైతం పింఛన్లు ఇప్పించాలంటూ అధికారులను, సర్పంచ్‌లను వేడుకుంటూ మళ్లీ దరఖాస్తులను అందజేశారు.

నేరాల నియంత్రణలో రాజీపడొద్దు

సమావేశంలో మాట్లాడుతున్న పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

జూన్‌ 2న ఇస్తామని

ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ అవతరణ వేడుకల్లో

ఊసెత్తని సర్కార్‌

నాలుగేళ్లుగా పింఛన్ల కోసం

ఎదురుచూపులు

జిల్లాలో 4,500 మంది

నూతన దరఖాస్తుదారులు

నా భర్త కోదండపాణి ఆనారోగ్యంతో మృతిచెందాడు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేశాను. నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు పింఛన్‌ మంజూరు కాలేదు. గ్రామ సభలలో సైతం దరఖాస్తులు అందజేశాను. పింఛన్‌ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్‌ మంజూరు చేయాలి.

– అల్లెం సుజాత, ఎస్‌ఎస్‌ తాడ్వాయి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement