గోదావరిఖని: కాళేశ్వరం జోన్‌పరిధిలోని ములుగు జిల్లా డీఎస్‌బీ ఎస్‌ఐగా పనిచేస్తున్న యు.ఉపేందర్‌రావును సీసీఎస్ రామగుండానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రామగుండం సీపీ అంబర్‌కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
మహాముత్తారం: రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. గురువారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భుభారతి పెండింగ్ దరఖాస్తులతో పాటు సాదాబైనామా, ఎలక్షన్ వర్కపెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశ్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
వాహనాల తనిఖీ
మహాముత్తారం: మండలంలోని యామన్‌పల్లి ప్రధాన రహదారి వద్ద మహాముత్తారం ఎస్సై రమేష్ గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనపత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
రేగొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భాగిర్థిపేట క్రాస్ వద్ద పరకాల–భూపాలపల్లి జాతీయ రహదారిపై పరకాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తేజావత్ రజిత, భూక్య లక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లో పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ప్రతీ గురువారం విచారణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో 18 ఏళ్లలోపు బాల నేరస్తులకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు తొలి సారి జిల్లాలో ఏర్పాటు చేసి జువైనైల్ జస్టిస్ బోర్డు ప్రతీ గురువారం కేసుల విచారణ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్, న్యాయమూర్తి జి.అఖిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన జిల్లా సెషన్స్ ఇన్‌చార్జ్ జడ్జి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బాలల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమన్నారు.


