భూపాలపల్లి అర్బన్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) భూపాలపల్లి ఏరియాలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్‌కు రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. సదస్సును జయపద్రం చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో కార్మికులను ఇబ్బందులు గురి చేస్తుంటే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితెల సమ్మయ్య, సదానందం, అవినాష్‌రెడ్డి, మధు, రాజేందర్, మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
14న ఆల్ చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్‌బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హై స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్ 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


