కాల్వ ఇలా.. పాఠశాలకు వెళ్లేదెలా? | - | Sakshi
Sakshi News home page

కాల్వ ఇలా.. పాఠశాలకు వెళ్లేదెలా?

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 6 వార్డులో అంబేడ్కర్‌ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదుట ఉన్న మురుగు కాల్వ నుంచి దుర్గంధం వస్తుంది. మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు అనేక మంది ఈ పాఠశాలలోకి రానున్నారు. కాల్వలో చెత్తాచెదారం పేరుకుపోయి పచ్చగా నీరు మారి విషకీటకాలు తిరుగుతున్నాయి. పురుగులు, దోమలు, ఈగలు విపరీతంగా పాఠశాల ఆవరణ చుట్టూ తిరుగుతున్నాయి. అయినా ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. అధికారులు వెంటనే కాల్వలను శుభ్రం చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement