‘ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి’

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ములుగు రూరల్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం డీఈఓ సిద్ధార్థరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యను వ్యాపారంగా చేస్తున్న పాఠశాలల యజమానులపై అధికారులు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్‌కుమార్‌, దిలీప్‌, కుమార్‌, ప్రవీణ్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement