పెంచిన ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెంచిన ధరలు తగ్గించాలి

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

ములుగు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేటఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరగకపోయినా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల హామీలను సైతం నాయకులు విస్మరించారని తెలిపారు. ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎరువుల బస్తాపై పెంచిన ధరలను తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, నర్సయ్య, కొమురయ్య, అయిలయ్య, సారయ్య, శ్రీనివాస్‌, కొండయ్య, రాజేందర్‌, శ్రీనివాస్‌, రాజకుమారి, శోభ, రజిత, కవిత, అనూష, సుమలత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నాయకుల ధర్నా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement