సింగరేణిని కాపాడేందుకు ఏకం కావాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిని కాపాడేందుకు ఏకం కావాలి

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

భూపాలపల్లి అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని, కార్మిక లోకం ఏకమై సింగరేణిని కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఏరియాలోని గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, మెడికల్‌ అన్‌ఫిట్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ నెల 12న మాజీ మంత్రి హరీశ్‌రావు భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement