పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలి

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

ములుగు/ఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపుతో పాటు పాఠశాలల పునఃప్రారంభ తదితర అంశాలపై మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని బడికి వెళ్లని వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 12 నుంచి 120 మందికి పైగా పెంచడంలో విశేష కృషి చేసిన కానిస్టేబుల్‌ దూపాటి సతీశ్‌, గ్రామ సర్పంచ్‌ నాగార్జున కలెక్టర్‌ అభినందించారు. అనంతరం కలెక్టర్‌ చిన్నబోయినపల్లిలోని డీఎన్‌టీ పాఠశాలలో సతీశ్‌ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ పరిశీలించి ప్రశంసించారు.

బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ను

సందర్శించిన కలెక్టర్‌

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండలంలోని ఏటూరునాగారం హైవే మార్గంలో ఉన్న బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌ను కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్‌ సౌకర్యాలు, వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌ను సందర్శించి పరిసర ప్రాంతాల అందాలను వీక్షించారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా సౌకర్యాలను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. అనంతరం ఐలాండ్‌లోని అభివృద్ధి పనులు, నిర్వహణ అంశాలపై అధికారులతో చర్చించి కలెక్టర్‌ పలు సూచనలు చేశారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement