● మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ
ములుగు: ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో జరిగిన సభలకు ఆమె హాజరై మాట్లాడారు. మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వాడ శుభ్రంగా ఉంటుందని, మన వాడ శుభ్రంగా ఉంటే మన పట్టణం శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనగాం సంపత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్లు గుగ్గిల్ల దివ్య సృజన్, నల్లెల్ల స్వాతి భరత్‌కుమార్, పౌడల ఓంప్రకాష్, ఆర్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


