మృగశిర కార్తె సందర్భంగా సోమవారం చేపల మార్కెట్‌లో మత్స్యకారులు, వ్యాపారులు పెద్ద ఎత్తున గోదావరి, తదితర ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకుని విక్రయించారు. సాధారణంగా రూ.200 కిలో ఉండగా మృగశిర కార్తె సందర్భంగా రూ.250లకు కిలో చేపలను విక్రయించారు. రకరకాల చేపలు మార్కెట్‌కు రావడంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేశారు. కార్తె రోజు చేపలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజల విశ్వా సం. దీంతో చేపలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు.
– ఏటూరునాగారం/వెంకటాపురం(కె)


