అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

ములుగు రూరల్‌/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఆర్వో రవికుమార్‌, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా సాద్యాఅసాద్యాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 64 దరఖాస్తులు రాగా ఇందిరమ్మ ఇళ్లు 20, పెన్షన్లు 17, ఇతర శాఖలకు సంబంధించినవి 27 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

గ్రీవెన్స్‌లో 64, గిరిజన దర్బార్‌లో 27 దరఖాస్తులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement