ఏటూరునాగారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనదర్బార్ చేపట్టి 27 మంది గిరిజనుల నుంచి వినతులను స్వీకరించారు. మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుడు 2008–09 నుంచి ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదని, దానికి కోసం నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నట్లు గిరిజనులు తెలిపారు. ములుగు గ్రామంలో సంధ్యారాణి ఎంబీఏ కంప్యూటర్ పూర్తి చేసి ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన గిరిజనులు రుణం కావాలని విన్నవించారు. గోవిందరావుపేట మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన స్వప్న తన భర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఐటీడీఏ ద్వారా టీఆర్‌ఎఫ్ కింద ఆర్థిక సహాయం చేయాలని కోరారు. గిరిజన సహకార సంస్థ మహాదేవ్‌పూర్‌లోని గ్యాస్ గోదాంలో డెలవరీ బాయ్స్‌గా పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారిని నియమించాలని గిరిజన ప్రాథమిక సహకార సంస్థ డైరెక్టర్‌లు బుచ్చయ్య, పోచయ్య తెలిపారు. గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం లోని ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిలో వ్యవసాయ సాగు కోసం బోరు నిర్మిస్తుండగా అటవీశాఖ వారు అడ్డుకుంటున్నారని, వారి నుంచి అనుమతి ఇప్పించాలని కోరారు. భూపాలపల్లి సుబ్బక్కపల్లిలో సౌర గిరిజల వికాసం నుంచి బోరు మంజూరు చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ ప్రతాప్, ఈఈ వీరభద్రం, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్‌టీసీ కంట్రోలర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


