కాళ్లు పని చేయకపోవడంతో 2020లో సదరం క్యాంపులో 66శాతంతో సర్టిఫికెట్ జారీ చేసి పింఛన్ మంజూరు చేశారు. ఇటీవల పింఛన్ నిలిపేశారు. సదరం క్యాంపునకు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. మరోసారి సదరం క్యాంపునకు అవకాశం కల్పించి పింఛన్ కొనసాగించాలి.
– అన్నం శ్రీను, కమలాపురం, మంగపేట
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
పూరి గుడిసులో జీవనం కొనసాగిస్తున్నా. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు చేయలేదు. ఇందిరమ్మ ఇంటికి అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు, నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– ఎర్రం వెంకన్న, బుచ్చంపేట
అల్పాహారం పెండింగ్ బిల్లులు చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న అల్పాహార బిల్లులను తక్షణమే చెల్లించాలని ఏఐటీయుసీ అనుబంధ సంఘం, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు. ఈ మేరకు నాయకులు భారతి, ప్రమీల, రాజకుమారి, సరోజిని, స్వరూప, శ్రీలత, రమ, వనజ తదితరులతో కలిసి గ్రీవెన్స్‌లో విన్నవించారు.


