హన్మకొండ కల్చరల్: ధర్మరక్షణ కోసం ముందుకు సాగాలని తోగుట పీఠం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి ఉద్బోధించారు. వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న రాజరాజేశ్వరీదేవి దేవాలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు, అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, బ్రాహ్మణసంఘాల నాయకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాతించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. దేవాలయ కల్యాణమండపంలో స్వామివారి పాదుకలకు పాదుకపూజ, గురువందనం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సంఘాల నాయకులు మోత్కూరి రాజేశ్వరరావు, ఐనవోలు సాయికృష్ణశర్మ, రాధాకృష్ణశర్మ, నాగిళ్ల షణ్ముఖ అవధాని తదితరులు స్వామిని ఆశీర్వాదం తీసుకున్నారు.


