నేడు మృగశిర కార్తె.. | - | Sakshi
Sakshi News home page

నేడు మృగశిర కార్తె..

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

చేపల విక్రయానికి మత్స్యకారుల ఏర్పాట్లు

ఏటూరునాగారం: నేటి మృగశిర కార్తెకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది సంప్రదాయకంగా రుతుపవన వర్షాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మృగశిర కార్తె రోజు చేపలను తింటే అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలు భావిస్తుంటారు. అందుకని మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపలు పట్టి విక్రయించడానికి వలలు సిద్ధం చేసుకున్నారు. నేడు(సోమవారం) ఉదయం నుంచే చేపలు అమ్మడానికి ఏటూరునాగారం మండల కేంద్రంలోని చేపల మార్కెట్‌ వద్దకు చేపలను తరలించడంతో పాటు ఓడవాడ, రామన్నగూడెం, రాంనగర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా చేపల విక్రయదారులు ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా మణుగూరు, రామప్ప, తుపాకులగూడెం, పాలెం ప్రాజెక్టుల నుంచి కూడా చేపలను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement