మహిళకు లైంగిక వేధింపులు.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై ఫిర్యాదు | Woman files complaint against actor Shiyas Kareem alleging harassment | Sakshi
Sakshi News home page

Shiyas Kareem: మహిళకు లైంగిక వేధింపులు.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై ఫిర్యాదు

Apr 27 2026 6:34 PM | Updated on Apr 27 2026 6:51 PM

Woman files complaint against actor Shiyas Kareem alleging harassment

ప్రముఖ మలయాళ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ షియాస్ కరీంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలోని పాలారివట్టం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఆర్థికంగా మోసం చేశాడంటూ విదేశాల్లో నివసిస్తున్న ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

తన నగ్న చిత్రాలను అశ్లీల వెబ్‌సైట్లలో పెడతానని బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వద్ద నుంచి రూ.65 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన సోషల్ మీడియా చాటింగ్స్, వాయిస్ రికార్డింగ్‌లను పోలీసులకు అందించింది. షియాస్ కరీంకు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులను సైతం పోలీసులకు సమర్పించింది. అతని వల్ల తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో ప్రస్తావించింది. వేధింపులు భరించలేకనే పోలీసుల ముందుకు వచ్చానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా.. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షియాస్‌ను అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చెన్నై విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో ఎర్నాకుళంలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కాసరగోడ్‌కు చెందిన మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడి వేధింపులతో పాటు దాదాపు రూ.11 లక్షలు వసూలు చేశాడని ఆ మహిళ ఆరోపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement