ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్‌కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)
#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him.
- Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026


