అలా లిప్‌లాక్‌ నుంచి తప్పించుకున్నా : సాయిపల్లవి  | Sai Pallavi Open About How She Escaped From Lip Lock Seen | Sakshi
Sakshi News home page

అలా లిప్‌లాక్‌ నుంచి తప్పించుకున్నా : సాయిపల్లవి 

Dec 13 2020 6:59 PM | Updated on Dec 13 2020 8:16 PM

Sai Pallavi Open About How She Escaped From Lip Lock Seen - Sakshi

కెరీర్‌ ఆరంభం నుంచే ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ‘ఫిదా’ చేసి కోట్లాది మంది అభిమానులను సంపాధించుకుంది నానుచరల్ బ్యూటీ సాయిపల్లవి‌. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తన నటనకు ‘ఫిదా’ అయిన దర్శక, నిర్మాతలు.. ముద్దు సీన్లు వద్దు అంటున్నా ఆమెకు వరస ఆఫర్లు ఇస్తున్నారు.

 ఇలా వరుస సినిమాతో దూసుకెళ్తున్న ఈ నాచురల్‌ బ్యూటీ.. తాజాగా ఓ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఓ దర్శకుడు తనతో ముద్దు సీన్‌ చేయించాలని ట్రై చేశాడని.. కానీ తనకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. ‘ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు. అయితే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశాను. ఆ సమయంలో మీటూ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సీన్ చేయమని సదరు దర్శకుడు బలవంత పెట్టలేదు. అలా 'మీటూ' కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నాను’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం ఈ అమ్మడు బయటపెట్టలేదు.
 

సాయిప‌ల్ల‌వి తెలుగులో 'విరాటపర్వం' మూవీలో నటిస్తోంది. దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది.  అలాగే నానినితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటిస్తోంది. దీంతో పాటు త‌మిళంలో 'పావ‌క‌థైగ‌ల్' అనే వెబ్‌సిరీస్‌లో ఆమె న‌టించింది. నాలుగు క‌థ‌లుగా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌ ఒక కథలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్ 18న విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement