
సాక్షి, మంచిర్యాల: నిర్మాత, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూర్ రామ్మోహన్ రావు మాతృమూర్తి పుస్కూర్ కమలాదేవి (93) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం మంచిర్యాలలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి, రామ్మోహన్ రావుని ఓదార్చారు. కాగా రామ్మోహన్ రావు ‘లక్ష్య, లవ్ స్టోరీ’ చిత్రాలతో పాటు ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ప్రారంభమైన చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.