స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్. తెలుగులో ‘డాక్టర్ కీర్తి- ఎంబీబీఎస్ ఎంఎస్ ’అనే పేరుతో మే 8న విడుదల అవుతుంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ - కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా ఉంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
నటి కవిత మాట్లాడుతూ - ‘మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు.


