మహేశ్ బాబు సోదరుడి కుమారుడు ఎంట్రీ.. టీజర్ రిలీజ్ | Jayakrishna Ghattamaneni Srinivasa Mangapuram teaser Out now | Sakshi
Sakshi News home page

Srinivasa Mangapuram Movie: మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ.. టీజర్ రిలీజ్

Apr 15 2026 7:09 PM | Updated on Apr 15 2026 8:08 PM

Jayakrishna Ghattamaneni Srinivasa Mangapuram teaser Out now

ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది.  ఈ మూవీని చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్‌గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్‌లో డైలాగ్స్, ఫైట్ సీన్స్‌ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉండనున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. కాగా..  ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement