విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018). ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్). శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లో జరుగుతున్నట్లు పేర్కొని, విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను కారులో ప్రయాణం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. ‘‘ఈ నగరానికి ఏమైంది’ సక్సెస్‌ని కొనసాగిస్తూ రూపొందిస్తోన్న చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్’. థాయ్‌ల్యాండ్‌లో 30 రోజుల షూట్‌ని ప్లాన్ చేశాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఏజీ ఆరోన్.


