చిరంజీవి, బాలకృష్ణ.. రేసులో తెలుగు హీరోయిన్‌ | Dimple Hayathi Will Get Movie Chance With Chiranjeevi And Balakrishna | Sakshi
Sakshi News home page

చిరంజీవి, బాలకృష్ణ.. డస్కీ బ్యూటీకి గోల్డెన్‌ ఛాన్స్‌

Apr 24 2026 10:21 AM | Updated on Apr 24 2026 10:32 AM

Dimple Hayathi Will Get Movie Chance With Chiranjeevi And Balakrishna

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్‌లో  రానున్న చిత్రంలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతికి ఛాన్స్‌ దక్కినట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. చివరిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో మెప్పించిన  ఈ తెలుగు బ్యూటీకి తన కెరీర్‌లో ఎక్కువగా గ్లామరస్‌ పాత్రలే దక్కాయి. అయితే, చిరు సినిమాలో తనకు ఒక సీరియస్‌ పాత్రను దర్శకుడు బాబీ క్రియేట్‌ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

తాజా వార్తల ప్రకారం  చిరంజీవి- బాబీ సినిమాలో డింపుల్  ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. తొలిసారి నెగటివ్ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారని తెలియడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరంగా, బాలకృష్ణ- గోపీచంద్ మలినేని తదుపరి చిత్రం కోసం నిర్మాతలు ఆమె పేరును  పరిశీలిస్తున్నారనే రూమర్‌ వచ్చింది. అందులో కూడా ప్రతినాయక పాత్రే కావడం విశేషం. ఇలా రెండు పెద్ద ప్రాజెక్ట్‌లలో ఆమె పేరు రావడంతో డింపుల్‌ వైరల్‌ అవుతుంది. డింపుల్‌లో మంచి టాలెంట్‌ ఉంది.  

కానీ, ఆమె కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మంచి ఛాన్స్‌ ఇంకా రాలేదని నెటిజన్లు చెబుతుంటారు. చిరు- బాబీ చిత్రాన్ని కె.వి.ఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తుండగా.. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌ను  వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement