Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా?

Cold War Prabhas And Pooja Hegde Not Even Eye Contact At Movie Promotion - Sakshi

Cold War Between Prabhas and Pooja Hegde: మూవీ ప్రమోషన్‌ కార్యక్రమం అంటే ఆ హీరోహీరోయిన్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఒకరిపై ఒకరు సరదాగా జోక్స్‌ వేసుకుంటూ చిత్ర విశేషాలను పంచుకుంటారు. అంతేకాదు ఒకరిపై ఒకరు కంప్లైట్స్‌ ఇచ్చుకోవడం, సిల్లిగా గొడవ పడటం చేస్తుంటారు. రీల్‌లైఫ్‌ కపుల్‌గా కనిపించే ఆ ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంటుంది. కానీ అవేవి రాధేశ్యామ్‌ ప్రమోషన్‌ కార్యక్రమంలో కనిపించలేదు. ఇటీవల ముంబైలో జరిగిన ఈ మూవీ ప్రమోషన్‌లో ప్రభాస్‌-పూజా హెగ్డే పక్కపక్కనే కుర్చున్నారు.. కానీ వారి మధ్య చాలా గ్యాప్‌ కనిపించింది.

చదవండి: ‘భీమ్లా నాయక్‌’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్‌ క్లారిటీ

కేవలం హాయ్‌.. బాయ్‌... పైపై చిరునవ్వులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా ఎన్నో అనుమానాలు రేకెత్తున్నాయి. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనేది రుజువైంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ మూవీ షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌-పూజకు గొడవలు జరిగాయంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎడమోహం పెడమోహంగానే వీరిద్దరూ షూటింగ్‌ను పూర్తి చేశారని ఫిలిం దూనియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై స్పందించిన చిత్ర బృందం అలాంటిదేం లేదని అందరికి సర్థిచెప్పింది.  కానీ ఈ తాజా ఈవెంట్‌లో ప్రభాస్‌-పూజ తీరు చూస్తుంటే ఆ వార్తలు వాస్తవమే అని తెలుస్తోంది.

చదవండి: సమంతపై జిమ్‌ ట్రైనర్‌ జునైద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ప్రెస్‌మీట్‌లో కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోనే లేదు. ఒకరు ఒకవైపు చూస్తే.. మరోకరు మరో వైపు చూస్తున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ముభావంగానే సమాధానం ఇచ్చారు. ఎవరి ప్రశ్నలకు వారే సమాధానం చెప్పారు తప్పా ఒకరి విషయంలో మరోకరు జోక్యం చేసుకోలేదు. దీంతో మిగతా సినిమా ప్రమోషన్లో మాదిరిగా ఇక్కడ ఆ అల్లరి, సందడి వాతావరణం కరువైంది. ఇదంతా చూస్తుంటే ఇంకా ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ అలాగే ఉందని స్పష్టమవుతోంది. సంక్రాంతికి ముందు జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం పూజా, ప్రభాస్ ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. కనీసం ఫ్రెండ్లీ కన్వర్జేషన్ కూడా కనిపించలేదు. 

ఇన్ని రోజులు అయినా, కలిసి షూటింగ్‌ చేసిన ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగలేదంటే ఏ రేంజ్‌లో విభేదాలు వచ్చాయో అంటూ రాధేశ్యామ్‌ ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. ఇంకా ఇలాగే ఇద్దరు మూవీ ప్రమోషన్స్‌ చేస్తే ఆ జోష్‌ మిస్‌ అవుతుందంటున్నారు. వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న రాధేశ్యామ్‌ మూవీ ప్రమోషన్స్‌ ఓ రెంజ్‌లో ఊహించుకున్న తమకు ప్రభాస్‌-పూజ తీరు నిరాశ కలిగిస్తుందంటూ నెటిజన్లు, ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా ప్రభాస్‌-పూజలు తమ తీరు మార్చుకున సఖ్యతగా కలిసి ప్రమోషన్‌ చేయాలని డార్లింగ్‌-బుట్టబొమ్మల ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top