‘ది బ్రేకింగ్‌ న్యూస్‌’ కోసం ఎదురు చూస్తున్నా : చిరంజీవి | Chiranjeevi Launches The Breaking News Movie First Look | Sakshi
Sakshi News home page

‘ది బ్రేకింగ్‌ న్యూస్‌’ కోసం ఎదురు చూస్తున్నా : చిరంజీవి

Apr 18 2026 7:33 PM | Updated on Apr 18 2026 7:58 PM

Chiranjeevi Launches The Breaking News Movie First Look

‘ది బ్రేకింగ్ న్యూస్’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్‌ చేసిన చిరంజీవి

ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రేకింగ్‌ న్యూస్‌’. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్‌ని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.

చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, ‘ది బ్రేకింగ్ న్యూస్’ ఒక మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement