గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆమిర్‌ ఖాన్‌ | Aamir Khan confirms 3 Idiots Movie sequel, Says script set 10 Years Later | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆమిర్‌.. సీక్వెల్‌ రెడీ

Apr 29 2026 4:05 PM | Updated on Apr 29 2026 4:33 PM

Aamir Khan confirms 3 Idiots Movie sequel, Says script set 10 Years Later

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.  సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘3 ఇడియట్స్‌’కు సీక్వెల్‌ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా, ఆర్‌. మాధవన్, శర్మాన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్‌’. రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్‌’ సినిమా సీక్వెల్‌ పనులు మొదలయ్యాయని ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. 

ఈ సీక్వెల్‌ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘3 ఇడియట్స్‌’కి సీక్వెల్‌ చేయనున్నాం...  కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్‌ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ, స్క్రీన్‌ప్లేను సెట్‌ చేసే పనిలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement