పంటల సాగు.. జాగ్రత్తలతో మేలు | - | Sakshi
Sakshi News home page

పంటల సాగు.. జాగ్రత్తలతో మేలు

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో

అప్రమత్తంగా ఉండాలి

లేదంటే నష్టపోయే అవకాశం

అలంపూర్‌ : వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. విత్తనాలు, ఎ రువులు, పురుగుల మందులు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీల బెడద అధికంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి సూచిస్తున్నారు. అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల కొనుగోళ్లలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే సాగు కష్టం బూ డిదలో పోసిన పన్నీరుగా మారుతుందని పేర్కొంటున్నారు. విత్తన, ఎరువుల కొనుగోళ్లలో రైతులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు.

విత్తనాల కొనుగోళ్లలో...

● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్‌ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి.

● విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులో విత్తనం రకం, నెంబర్‌, గడువు తేదీ, కొనుగోలు తేదీ, డీలరు సంతకం, రైతు సంతకం బిల్లులో ఉండే విధంగా చూసుకోవాలి.

● లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరచిన డబ్బాల నుంచి కొనకపోవడం మంచిది. గడవు దాటిన విత్తనాల జోలికి వెళ్లవద్దు.

● బిల్లుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకపు నెంబర్‌, రైతు పేరు, గ్రామం పేరు,విక్రయదారుడి సంతకం, తేదీలు, రకం పేరు, బ్యాచ్‌ నెంబర్‌, గడువ తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి.

● కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్‌, సీసా, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా నిర్ధారించుకోవాలి.

● విక్రయదారుడు ఇచ్చే కరపత్రాలను తీసుకోని వాటిలో పేర్కొన్న అంశాలను పరిశీలించాలి.

● మొలకెత్తే దశలో, పూత దశలో లోపాలు కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి.

● విత్తనాలు కొనుగోలు చేసిన బి ల్లును పంట కాలంపూర్త య్యే వరకు దాచి పెట్టుకోవాలి.

● అరువు పద్ధతిలో కొనుగో లు చేసినప్పటికీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి.

● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని తీసుకోవాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న విత్తనాలను వాడాలి.

పురుగు మందుల కొనుగోలు సమయంలో...

● చీడ పీడల నివారణకు వినియోగించే క్రిమి సంహారక మందుల కొనుగోలు సమయాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి.

● వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే వాడాలి.

● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడవద్దు.

● లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.

● పురుగు మందుల డబ్బాపై వజ్రాకారంలో పురుగుల మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విష పూరితమైతే నీలం రంగు, స్వల్ప విష పూరితమైతే ఆకు పచ్చ రంగు గుర్తులు ఉంటాయి.

● పురుగుల మందులు రెండు మూడు రకాలు కలిపి వాడరాదు.

●వాడిన డబ్బాలు, సీసాలు, ధ్వంసం చేసి గుంతల్లో పూడ్చి పెట్టాలి. పురుగుల మందులు వాడటానికి వినియోగించిన పాత్రలను ఇతర అవసరాలకు వినియోగించ రాదు.

ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు :

● లైసెన్స్‌ దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన బిల్లులు, ఖాళీ సంచులు పంట కాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలి.

●మిషన్‌ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులనే వాడాలి. ఒక వేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్‌ ఉందో లేదో చూసుకోవాలి.

● ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు ఖచ్చితంగా ఉండాలి.

● కొనుగోలు సమయంలో డీలర్‌ రశీదులో రైతు విధిగా సంతకం చేయాలి.

● ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపాలి.

● చిల్లుపడిన, చిరిగిన బస్లాల్లోని ఎరువుల బస్తాలను కొనుగోళు చేయరాదు. అన్య పదార్థాలు కనిపిస్తే ఆ ఎరువులను కల్తీలుగా గుర్తించాలి.

పాడి–పంట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement