బహుజన బలం.. అధికార పీఠం వైపు | - | Sakshi
Sakshi News home page

బహుజన బలం.. అధికార పీఠం వైపు

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం ద క్కడం లేదని, జనాభాలో అత్యధిక శాతం ఉన్న ఈ వర్గాలు అధికారానికి దూరంగా ఉండటం సామా జిక న్యాయానికి విరుద్ధమని ధర్మ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సామాజిక న్యాయం–రాజ్యాధికారం సభలో ఆయ న ప్రసంగించారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 90 శాతం మేర ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇప్పటికీ రాజకీయ నిర్ణయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ వర్గాలను గుర్తు చేసుకుంటున్న ప్రధా న రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వా త వారి సమస్యలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సాధనలో వెనుకబడిన వర్గాలు కీలక పాత్ర పోషించినప్పటికీ, రాష్ట్ర నిర్మాణం అనంతరం వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదన్నారు. సామాజిక సమానత్వం సాధించాలంటే రాజకీయ అధికారం కూడా సమానంగా పంచబడాలని పేర్కొన్నారు. ఈ దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐక్యత అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. ధర్మ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక మార్పు కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు ప్రజలను చైతన్యపరుస్తూ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పా రు. సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల హక్కుల సాధనకు సంయుక్త కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ప్రజల్లో అవగాహన పెంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కుమారస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెస ర్‌ రామయ్య యాదవ్‌, తోట్ల రాఘవేంద్ర, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శి బాలయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement