ఎర్రవల్లి: మండలంలోని తిమ్మాపురం పెద్ద చెరువులో చేప ల వలకు ఓ మొసలి చిక్కింది. మత్య్సకారుల సంఘం సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువులో స్థానిక మత్స్యకారులు రెండు రోజులుగా చేపలు పడుతుండగా ఆదివారం వలకు మొసలి చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. అనంతరం మత్స్యకారులు వలను ఒడ్డుకు తీసుకొచ్చి ఫారె స్ట్, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారి మన్యమయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మొసలిని బంధించి, బీచుపల్లి సమీపంలోని కృష్ణానది మడుగులో వదిలారు.
ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధం
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు జనరేటర్ దగ్ధమైన ఘటన మ ండల పరిధిలో ఆది వారం చోటుచేసు కుంది. నాచారం గ్రా మంలోని శ్రీ వెంకటసాయి ఇండస్ట్రీస్–పారాబాయిల్డ్ రైస్‌మిల్‌లో జనరేటర్ రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రైస్‌మిల్ యజమాని చల్లా శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపుచేయగా అప్పటికే జనరేటర్ కాలిపోయింది. సుమారు రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.


