జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల బడులు శిథిలావస్థకు చేరాయి. ఏఐ, ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించినా.. తరగతి గదులు లేకుంటే విద్యార్థులు ఎక్కడ కూర్చొని తరగతులు వినాలి. పూర్తిస్థాయిలో టీచింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు అధికారులు వెంటనే స్పందించి పాఠశాలల్లో వసతులు కల్పించాలి.
– అర్జున్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో బయటికి వెళ్లే దుస్థితి నెలకొంది. దేవరకద్ర, చిన్నచింతకుంట, వడ్డెమాన్, మాడల్ బేసిక్ పాఠశాలల్లో సమస్యలపై గతంలో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. తరగతి, వంట గదులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. అధికారులు స్పందించకపోతే పీడీఎస్‌యూ ఆధ్వర్యమంలో ఉద్యమిస్తాం.
– సీతారాం,
పీడీఎస్‌యూ, జిల్లా ప్రధాన కార్యదర్శి


